Logo

2రాజులు అధ్యాయము 9 వచనము 19

2రాజులు 9:11 యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడు వానిని వాని మాటలు మీరెరిగెయున్నారని చెప్పెను.

2రాజులు 9:17 యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచియుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.

2రాజులు 9:18 కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కి పోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగిరాక నిలిచెనని సమాచారము తెలిపెను.