Logo

2రాజులు అధ్యాయము 9 వచనము 28

2రాజులు 12:21 ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.

2రాజులు 14:19 అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.

2రాజులు 14:20 వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.

2రాజులు 23:20 అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నర శల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.

2దినవృత్తాంతములు 25:28 అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతని అక్కడ చంపి, గుఱ్ఱములమీద అతని శవము ఎక్కించి తీసికొనివచ్చి యూదాపట్టణమందు అతని తండ్రులయొద్ద అతని పాతిపెట్టిరి.

2దినవృత్తాంతములు 35:24 కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొనివచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.

2రాజులు 8:29 రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగిరాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.

2రాజులు 23:30 అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.

2దినవృత్తాంతములు 22:9 అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటివారు ఇక నెవరును లేకపోయిరి.