Logo

2రాజులు అధ్యాయము 10 వచనము 20

1రాజులు 18:19 అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారినందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను.

1రాజులు 18:20 అహాబు ఇశ్రాయేలువారందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను.

1రాజులు 21:12 ఎట్లనగా వారు ఉపవాసదినము చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టిరి.

యోవేలు 1:14 ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.

నిర్గమకాండము 32:5 అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా

లేవీయకాండము 23:2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.

సంఖ్యాకాండము 22:22 అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.

2రాజులు 3:3 ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను.

యోవేలు 2:15 సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి.

రోమీయులకు 11:4 అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.