Logo

2రాజులు అధ్యాయము 10 వచనము 23

2రాజులు 10:15 అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి నీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా అని అతనినడుగగా యెహోనాదాబు ఉన్నదనెను. ఆలాగైతే నాచేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని

మత్తయి 13:30 కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.

మత్తయి 13:41 మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.

మత్తయి 25:32 అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి

మత్తయి 25:33 తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.

2సమూయేలు 3:6 సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయము చేసెను.