Logo

2రాజులు అధ్యాయము 20 వచనము 10

2రాజులు 2:10 అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.

2రాజులు 3:18 ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును.

యెషయా 49:6 నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించియున్నాను.

మార్కు 9:28 ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.

మార్కు 9:29 అందుకాయన ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.

యోహాను 14:12 నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

యెహోషువ 10:14 యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.