Logo

2రాజులు అధ్యాయము 20 వచనము 19

లేవీయకాండము 10:3 అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను ఇది యెహోవా చెప్పిన మాట నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచుకొందును;

1సమూయేలు 3:18 సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్ఠికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.

యోబు 1:21 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగివెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

కీర్తనలు 39:9 దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని.

విలాపవాక్యములు 3:22 యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.

విలాపవాక్యములు 3:39 సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?

ఎస్తేరు 9:30 మరియు యూదుడైన మొర్దెకైయును రాణియైన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపువారిమీదను ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా

యిర్మియా 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

జెకర్యా 8:19 సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.

లూకా 2:10 అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;

లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.

1రాజులు 2:38 షిమీ తమరు సెలవిచ్చినది మంచిదేను; నా యేలినవారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసెదనని రాజుతో చెప్పెను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను.

1రాజులు 11:12 అయినను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమారునిచేతిలోనుండి దాని తీసివేసెదను.

2దినవృత్తాంతములు 32:26 హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మునుతాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనులమీదికి రాలేదు.

2దినవృత్తాంతములు 34:28 నేను నీ పితరులయొద్ద నిన్ను చేర్చుదును; నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు; ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులార చూడవు.

అపోస్తలులకార్యములు 21:14 అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి.