Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 1 వచనము 1

ఆదికాండము 4:25 ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.

ఆదికాండము 4:26 మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

ఆదికాండము 5:3 ఆదాము నూటముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.

ఆదికాండము 5:8 షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

లూకా 3:38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.

ఆదికాండము 5:9 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.

ఆదికాండము 5:10 కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిదివందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:11 ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

లూకా 3:38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.

ఆదికాండము 5:1 ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;

ఆదికాండము 5:4 షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.

లూకా 3:37 లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు,