Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 1 వచనము 3

ఆదికాండము 5:21 హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.

ఆదికాండము 5:22 హనోకు మెతూషెలను కనిన తరువాత మూడువందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:23 హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.

ఆదికాండము 5:24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

హెబ్రీయులకు 11:5 విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.

యూదా 1:14 ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినిగూర్చియు,

ఆదికాండము 5:25 మెతూషెల నూటఎనుబది యేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.

ఆదికాండము 5:26 మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడువందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:27 మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

లూకా 3:37 లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు,

ఆదికాండము 5:28 లెమెకు నూటఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని

ఆదికాండము 5:29 భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మనచేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను

ఆదికాండము 5:30 లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:31 లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

లూకా 3:36 షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,

ఆదికాండము 5:18 యెరెదు నూటఅరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.