Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 1 వచనము 11

ఆదికాండము 10:13 మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను

ఆదికాండము 10:14 పత్రుసీయులను కస్లూహీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు.

యెషయా 66:19 నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్దకును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

యిర్మియా 46:9 గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.

యెహెజ్కేలు 27:10 పారసీక దేశపువారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.