Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 1 వచనము 10

ఆదికాండము 10:8 కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.

ఆదికాండము 10:9 అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.

ఆదికాండము 10:10 షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.

ఆదికాండము 10:11 ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును

ఆదికాండము 10:12 నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.

మీకా 5:6 వారు అష్షూరు దేశమును, దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గముచేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.