Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 4 వచనము 40

న్యాయాధిపతులు 18:7 కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయులవలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారబలము పొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమాన పరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై యే మనుష్యులతోను సాంగత్యము లేకుండుటయు చూచిరి.

న్యాయాధిపతులు 18:8 వారు జొర్యా లోను ఎష్తాయోలులోను ఉండు తమ స్వజనులయొద్దకు రాగా వారుమీ తాత్పర్యమేమిటని యడిగిరి.

న్యాయాధిపతులు 18:9 అందుకు వారులెండి, వారిమీద పడుదము, ఆ దేశమును మేము చూచితివిు, అది బహు మంచిది, మీరు ఊరకనున్నా రేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి.

న్యాయాధిపతులు 18:10 జనులు నిర్భయముగా నున్నారు గనుక మీరు పోయి వారిమీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మీచేతికి దాని నప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదువలేదనిరి.

ఆదికాండము 9:22 అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.

ఆదికాండము 9:23 అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచివెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు

ఆదికాండము 9:24 అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసిన దానిని తెలిసికొని

ఆదికాండము 9:25 కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

ఆదికాండము 9:26 మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక కనాను అతనికి దాసుడగును.

ఆదికాండము 9:27 దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.

ఆదికాండము 9:28 ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.

ఆదికాండము 9:29 నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 10:6 హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.

కీర్తనలు 78:51 ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.

కీర్తనలు 105:23 ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను.

ఆదికాండము 14:5 పదునాలుగవ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో

ఆదికాండము 49:7 వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.