ఆదికాండము 27:40 నీవు నీ కత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
2రాజులు 8:20 ఇతని దినములలో ఎదోమీయులు యూదా రాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున
2రాజులు 8:21 యెహోరాము తన రథములన్నిటిని తీసికొనిపోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదోమీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి.
2రాజులు 8:22 అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.
1రాజులు 22:47 ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను.
2రాజులు 3:9 ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.
2రాజులు 3:5 అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజుమీద తిరుగుబాటు చేయగా
2దినవృత్తాంతములు 25:12 ప్రాణముతోనున్న మరి పదివేలమందిని యూదావారు చెరపట్టుకొని, వారిని ఒక పేటుమీదికి తీసికొనిపోయి ఆ పేటుమీదనుండి వారిని పడవేయగా వారు తుత్తునియలైపోయిరి.