Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 29 వచనము 8

2దినవృత్తాంతములు 24:18 జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు, చేసిన యీ యపరాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.

2దినవృత్తాంతములు 34:24 ఆలకించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పించెదను.

2దినవృత్తాంతములు 34:25 వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమచేతి పనులవలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఈ స్థలముమీద మితిలేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపినవానికి ఈ వార్త తెలుపుడి.

2దినవృత్తాంతములు 36:14 అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.

2దినవృత్తాంతములు 36:15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన

2దినవృత్తాంతములు 36:16 పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.

ద్వితియోపదేశాకాండము 28:15 నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.

ద్వితియోపదేశాకాండము 28:16 పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;

ద్వితియోపదేశాకాండము 28:17 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;

ద్వితియోపదేశాకాండము 28:18 నీ గర్భఫలము నీ భూమిపంట నీ ఆవులు నీ గొఱ్ఱమేకల మందలు శపింపబడును;

ద్వితియోపదేశాకాండము 28:19 నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు.

ద్వితియోపదేశాకాండము 28:20 నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.

2దినవృత్తాంతములు 28:6 రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.

2దినవృత్తాంతములు 28:7 పరాక్రమశాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభా ముఖ్యుడైన అజ్రీకామును ప్రధాన మంత్రియైన ఎల్కొనానును హతము చేసెను.

2దినవృత్తాంతములు 28:8 ఇదియు గాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చెరతీసికొనిపోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.

ద్వితియోపదేశాకాండము 28:25 యెహోవా నీ శత్రువులయెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారియెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటిలోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు.

లేవీయకాండము 26:32 నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.

ద్వితియోపదేశాకాండము 28:59 యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును.

1రాజులు 9:8 ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసెనని యడుగగా

యిర్మియా 18:15 అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు.

యిర్మియా 18:16 వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.

యిర్మియా 19:8 ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.

యిర్మియా 25:9 ఈ దేశముమీదికిని దీని నివాసులమీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.

యిర్మియా 25:18 నేటివలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.

యిర్మియా 29:18 యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులచేత వారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి.

2దినవృత్తాంతములు 7:21 అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా

2దినవృత్తాంతములు 30:7 తమ పితరుల దేవుడైన యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదొ మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను.

యిర్మియా 51:37 బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.

మీకా 6:16 ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతిపుట్టించు జనులుగాను పట్టణనివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను.

మలాకీ 1:5 కన్నులార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు.