Logo

ఎజ్రా అధ్యాయము 2 వచనము 36

1దినవృత్తాంతములు 9:10 యాజకులలో యెదాయా యెహోయారీబు యాకీను,

1దినవృత్తాంతములు 24:7 మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు,

ఎజ్రా 3:9 యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయులైన వారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పని చేయించుటకు నియమింపబడిరి.

నెహెమ్యా 7:39 యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును

1దినవృత్తాంతములు 24:11 తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,

ఎజ్రా 7:24 మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరినిగూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.

నెహెమ్యా 10:28 అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.

నెహెమ్యా 11:10 యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును