Logo

ఎజ్రా అధ్యాయము 2 వచనము 63

నెహెమ్యా 7:65 కాగా అధికారి ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.

నెహెమ్యా 8:9 జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.

నెహెమ్యా 10:1 మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా

లేవీయకాండము 2:3 ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.

లేవీయకాండము 2:10 ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.

లేవీయకాండము 6:17 దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.

లేవీయకాండము 6:29 యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.

లేవీయకాండము 7:16 అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దానినర్పించునాడే తినవలెను.

లేవీయకాండము 10:17 మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలి పశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధము గదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.

లేవీయకాండము 10:18 ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.

లేవీయకాండము 22:2 ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటివలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైనవాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.

లేవీయకాండము 22:3 నీవు వారితో ఇట్లనుము మీ తర తరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించువాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.

లేవీయకాండము 22:10 అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,

లేవీయకాండము 22:14 ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైనదానిని తినినయెడల వాడు ఆ ప్రతిష్ఠితమైనదానిలో అయిదవవంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను.

లేవీయకాండము 22:15 ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైనవాటిని తినుటవలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.

లేవీయకాండము 22:16 నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము.

సంఖ్యాకాండము 18:9 అగ్నిలో దహింపబడని అతిపరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్నిటిలోను, వారి అపరాధపరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగిచెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.

సంఖ్యాకాండము 18:10 ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.

సంఖ్యాకాండము 18:11 మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటినిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.

సంఖ్యాకాండము 18:19 ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన.

సంఖ్యాకాండము 18:32 మీరు దానిలోనుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాపశిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.

నిర్గమకాండము 28:30 మరియు నీవు న్యాయవిధానపతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.

లేవీయకాండము 8:8 ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి

సంఖ్యాకాండము 27:21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.

ద్వితియోపదేశాకాండము 33:8 లేవినిగూర్చి యిట్లనెను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.

1సమూయేలు 28:6 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.

ద్వితియోపదేశాకాండము 16:17 వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెనచొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.

1దినవృత్తాంతములు 9:1 ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడిన మీదట వారి పేళ్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొనిపోబడిరి.

యెహెజ్కేలు 13:9 వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాకపోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగిరారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.

యెహెజ్కేలు 44:24 జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతిదినములను ఆచరించుదురు.

హగ్గయి 1:1 రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా

హగ్గయి 2:2 నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము