Logo

ఎజ్రా అధ్యాయము 2 వచనము 42

1దినవృత్తాంతములు 26:1 ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.

1దినవృత్తాంతములు 26:2 మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,

1దినవృత్తాంతములు 26:3 ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై యేడవవాడు.

1దినవృత్తాంతములు 26:4 దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు,

1దినవృత్తాంతములు 26:5 అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.

1దినవృత్తాంతములు 26:6 వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరాక్రమశాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.

1దినవృత్తాంతములు 26:7 షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.

1దినవృత్తాంతములు 26:8 ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.

1దినవృత్తాంతములు 26:9 మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిదిమంది.

1దినవృత్తాంతములు 26:10 మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠభాగస్థునిగా చేసెను,

1దినవృత్తాంతములు 26:11 రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.

1దినవృత్తాంతములు 26:12 ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి.

1దినవృత్తాంతములు 26:13 చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లు వేసిరి.

1దినవృత్తాంతములు 26:14 తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచనకర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటి వేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,

1దినవృత్తాంతములు 26:15 ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.

1దినవృత్తాంతములు 26:16 షుప్పీమునకును హోసాకును పడమటితట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటి పడెను.

1దినవృత్తాంతములు 26:17 తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును, దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,

1దినవృత్తాంతములు 26:18 బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.

1దినవృత్తాంతములు 26:19 కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.

నెహెమ్యా 7:45 ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండుగురును

ఎజ్రా 7:7 మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి.