Logo

యోబు అధ్యాయము 7 వచనము 8

యోబు 20:9 వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

కీర్తనలు 37:36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

యోబు 13:27 బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ల చుట్టు గిఱిగీసియున్నావు

యోబు 14:3 అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు.

కీర్తనలు 39:11 దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మటకొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)

కీర్తనలు 90:8 మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.

కీర్తనలు 90:9 నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము.

యోబు 7:21 నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేకపోయెదను.

2సమూయేలు 12:23 ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదును గాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.

యోబు 10:21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు

ప్రసంగి 9:5 బ్రదికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.

యిర్మియా 10:20 నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నియు తెగిపోయెను, నా పిల్లలు నాయొద్దనుండి తొలగిపోయియున్నారు, వారు లేకపోయిరి, ఇకమీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు.

విలాపవాక్యములు 5:7 మా తండ్రులు పాపముచేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.

1పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.