Logo

యోబు అధ్యాయము 7 వచనము 19

యోబు 9:18 ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.

కీర్తనలు 6:3 నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?

కీర్తనలు 13:1 యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?

కీర్తనలు 13:2 ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?

కీర్తనలు 13:3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము

కీర్తనలు 94:3 యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?

ప్రకటన 6:10 వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.

యోబు 3:24 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

యోబు 14:6 కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము.

యోబు 40:2 ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను.