Logo

యోబు అధ్యాయము 23 వచనము 6

యోబు 9:19 బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా ప్రతివాదిగానుండ తెగించువాడెవడని ఆయన యనును?

యోబు 9:33 మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.

యోబు 9:34 ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెను నేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.

యోబు 13:21 నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము

యెషయా 27:4 నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండినయెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.

యెషయా 27:8 నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపానుచేత దాని తొలగించితివి

యెహెజ్కేలు 20:33 నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసెదను.

యెహెజ్కేలు 20:35 జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు.

కీర్తనలు 138:3 నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.

2కొరిందీయులకు 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును

2కొరిందీయులకు 12:10 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.

యోబు 22:4 ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?

యోబు 30:21 నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు

యోబు 40:9 దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటి స్వరముతో నీవు గర్జింపగలవా?

దానియేలు 10:18 అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు, భయపడకుము,

ఎఫెసీయులకు 3:16 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,