Logo

యోబు అధ్యాయము 23 వచనము 9

కీర్తనలు 89:46 యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?

యెషయా 8:17 యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసికొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను.

యోబు 9:11 ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

యోబు 10:13 అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.

యోబు 34:29 ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనినయెడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే

యోబు 42:5 వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.

కీర్తనలు 10:1 యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు?

కీర్తనలు 139:5 వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.

పరమగీతము 3:1 రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.