Logo

లూకా అధ్యాయము 2 వచనము 51

లూకా 9:45 అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.

లూకా 18:34 వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగుచేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.

మార్కు 9:10 మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.

మార్కు 9:32 వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.