Logo

లూకా అధ్యాయము 4 వచనము 31

యోహాను 8:59 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను.

యోహాను 10:39 వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారిచేతినుండి తప్పించుకొనిపోయెను.

యోహాను 18:6 ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీదపడిరి.

యోహాను 18:7 మరల ఆయన మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా

అపోస్తలులకార్యములు 12:18 తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.

1సమూయేలు 18:11 ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.

1సమూయేలు 19:10 సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము గలిగి యీటె విసిరెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.

మత్తయి 4:13 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

లూకా 24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.

యోహాను 5:13 ఆయన ఎవడో స్వస్థత నొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.

యోహాను 20:14 ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.