Logo

లూకా అధ్యాయము 21 వచనము 20

లూకా 8:15 మంచినేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.

కీర్తనలు 27:13 సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము

కీర్తనలు 27:14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

కీర్తనలు 37:7 యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము.

కీర్తనలు 40:1 యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.

రోమీయులకు 2:7 సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

రోమీయులకు 5:3 అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి

రోమీయులకు 8:25 మనము చూడనిదానికొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.

రోమీయులకు 15:4 ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధకలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.

1దెస్సలోనీకయులకు 1:3 మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

2దెస్సలోనీకయులకు 3:5 దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.

హెబ్రీయులకు 6:11 మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును

హెబ్రీయులకు 6:15 ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.

హెబ్రీయులకు 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైయున్నది.

యాకోబు 1:3 మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

యాకోబు 5:7 సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా

యాకోబు 5:8 ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.

యాకోబు 5:9 సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.

యాకోబు 5:10 నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.

యాకోబు 5:11 సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

ప్రకటన 1:9 మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

ప్రకటన 2:2 నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు

ప్రకటన 2:3 నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.

ప్రకటన 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధనకాలములో నేనును నిన్ను కాపాడెదను.

ప్రకటన 13:10 ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.

ప్రకటన 14:12 దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.

కీర్తనలు 112:7 వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.

కీర్తనలు 131:2 నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్ద నున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది.

సామెతలు 1:33 నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.

ప్రసంగి 7:8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతము గలవాడు శ్రేష్ఠుడు

మత్తయి 24:6 మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.

లూకా 21:9 మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.

రోమీయులకు 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

2కొరిందీయులకు 6:4 మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక

2దెస్సలోనీకయులకు 2:2 మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.

యాకోబు 1:4 మీరు సంపూర్ణులును, అనూనాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

2పేతురు 1:6 జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని,