Logo

యిర్మియా అధ్యాయము 5 వచనము 4

యిర్మియా 32:19 ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమునుబట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.

2దినవృత్తాంతములు 16:9 తనయెడల యథార్థహృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతితప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.

కీర్తనలు 11:4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.

కీర్తనలు 11:5 యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు,

కీర్తనలు 11:6 దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.

కీర్తనలు 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.

కీర్తనలు 51:6 నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.

సామెతలు 22:12 యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.

రోమీయులకు 2:2 అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.

యిర్మియా 2:30 నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.

యిర్మియా 7:28 గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టివేయబడియున్నది.

2దినవృత్తాంతములు 28:22 ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.

సామెతలు 23:35 నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.

సామెతలు 27:22 మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.

యెషయా 1:5 నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.

యెషయా 1:6 అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

యెషయా 9:13 అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.

యెషయా 42:25 కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధబలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.

యెహెజ్కేలు 24:13 నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్రపడకయుందువు.

జెఫన్యా 3:1 ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.

జెఫన్యా 3:2 అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు.

జెఫన్యా 3:7 దాని విషయమై నా నిర్ణయమంతటిచొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశ గలవారైరి.

సామెతలు 21:29 భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.

యెషయా 48:4 నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి

యెహెజ్కేలు 3:7 అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు.

యెహెజ్కేలు 3:8 ఇదిగో వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను.

యెహెజ్కేలు 3:9 నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగా ఉండు వజ్రమువలె చేసెదను; వారికి భయపడకుము, వారందరు తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము.

జెకర్యా 7:11 అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి.

జెకర్యా 7:12 ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండునట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవాయొద్దనుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను.

రోమీయులకు 2:4 లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?

రోమీయులకు 2:5 నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

హెబ్రీయులకు 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?

ఆదికాండము 19:34 మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.

నిర్గమకాండము 7:23 జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.

లేవీయకాండము 26:23 శిక్షల మూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల

ద్వితియోపదేశాకాండము 21:18 ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాట గాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయినయెడల

న్యాయాధిపతులు 4:1 ఏహూదు మరణమైనతరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక

1రాజులు 21:1 ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా

2రాజులు 1:11 మరల రాజు ఏబది మందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.

యోబు 41:24 దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.

సామెతలు 13:18 శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.

సామెతలు 15:32 శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును.

యెషయా 24:2 ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొనువారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలుగును.

యెషయా 26:11 యెహోవా, నీ హస్తమెత్తబడియున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును.

యెషయా 57:10 నీ దూర ప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.

యెషయా 57:17 వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.

యెషయా 59:12 మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ యెదుట విస్తరించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.

యిర్మియా 3:3 కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయియున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్లకున్నావు.

యిర్మియా 8:5 యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము చేసికొని తిరిగిరామని యేల చెప్పుచున్నారు?

యిర్మియా 13:23 కూషు దేశస్ధుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.

యిర్మియా 15:7 దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నాయొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను.

యిర్మియా 31:18 నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

యిర్మియా 32:3 యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతని చూచును,

యిర్మియా 35:13 నీవు వెళ్లి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము యెహోవా వాక్కు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలంకిపరా? యిదే యెహోవా వాక్కు.

యిర్మియా 36:24 రాజైనను ఈ మాటలన్నిటిని వినిన యతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు.

యిర్మియా 38:21 నీవు ఒకవేళ బయలు వెళ్లకపోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.

విలాపవాక్యములు 1:5 దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి

యెహెజ్కేలు 2:4 వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారియొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు

యెహెజ్కేలు 5:6 అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టునున్న అన్యజనులకంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి

యెహెజ్కేలు 22:24 నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీమాట ప్రకటింపుము నీవు పవిత్రము కాని దేశమువై యున్నావు

యెహెజ్కేలు 24:12 అలసట పుట్టువరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను, మష్టుతోకూడ దానిని అగ్నిలో వేయుము,

దానియేలు 9:13 మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.

హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.

హోషేయ 5:2 వారు మితి లేకుండ తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరిని శిక్షింతును.

ఆమోసు 4:6 మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

ఆమోసు 4:9 మరియు మీ సస్యములను ఎండుతెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపుచెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.

ఆమోసు 6:12 గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,

హగ్గయి 2:17 తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.

లూకా 7:32 సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.

లూకా 8:6 మరికొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను.

లూకా 15:15 వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.

లూకా 23:40 అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?

ప్రకటన 9:20 ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.

ప్రకటన 16:9 కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు.