Logo

యిర్మియా అధ్యాయము 5 వచనము 12

యిర్మియా 3:6 మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను ద్రోహినియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టుక్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.

యిర్మియా 3:7 ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగిరమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దానిచూచెను.

యిర్మియా 3:8 ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభిచారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది.

యిర్మియా 3:9 రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను.

యిర్మియా 3:10 ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యిర్మియా 3:11 కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొనియున్నది.

యిర్మియా 3:20 అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి; ఇదే యెహోవా వాక్కు.

యెషయా 48:8 అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియును.

హోషేయ 5:7 యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడ లయమగుదురు.

హోషేయ 6:7 ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు.

యెషయా 24:16 నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.

యిర్మియా 5:15 ఇశ్రాయేలు కుటుంబము వారలారా, ఆలకించుడి, దూరముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.

యిర్మియా 12:1 యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?