Logo

యిర్మియా అధ్యాయము 29 వచనము 10

యిర్మియా 29:23 చెరపట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబువలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 29:31 చెరలోనున్న వారికందరికి నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలామీయుడైన షెమయానుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

యిర్మియా 27:15 నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించునట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజలందరితోను నేను ఈ మాటలు చెప్పితిని

యిర్మియా 14:14 యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

యిర్మియా 23:21 నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.

యిర్మియా 27:14 కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్దమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 28:11 ప్రజలందరి యెదుట ఇట్లనెను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీదనుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.

యిర్మియా 29:15 బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే,

యిర్మియా 29:21 నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

విలాపవాక్యములు 2:14 నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికిపోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.

యెహెజ్కేలు 13:2 నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి, మనస్సు వచ్చినట్లు ప్రవచించువారితో నీవీలాగు చెప్పుము యెహోవా మాట ఆలకించుడి.

యెహెజ్కేలు 22:28 మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టి సోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారైయున్నారు.

ఎఫెసీయులకు 5:6 వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి; ఇట్టి క్రియలవలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును

2పేతురు 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ద బోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.

1యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి యున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.