Logo

యిర్మియా అధ్యాయము 29 వచనము 22

యిర్మియా 29:8 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.

యిర్మియా 29:9 వారు నా నామమునుబట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 14:14 యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

యిర్మియా 14:15 కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.

విలాపవాక్యములు 2:14 నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికిపోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.

ద్వితియోపదేశాకాండము 13:5 నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.

1రాజులు 22:11 కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.

1రాజులు 22:25 అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను.

2రాజులు 2:24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.

2దినవృత్తాంతములు 18:10 అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా యినుపకొమ్ములు చేయించుకొనివచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను.

2దినవృత్తాంతములు 18:24 అందుకు మీకాయా దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్లు దినమున దాని తెలిసికొందువని చెప్పెను.

2దినవృత్తాంతములు 34:8 అతని యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున, దేశమును మందిరమును పవిత్రపరచుట యైన తరువాత, అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టాణాధిపతి యైన మయశేయాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోహాహాజు కుమారుడగు యోవాహాజును, తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను.

యెషయా 9:15 పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.

యిర్మియా 20:4 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసికొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.

యిర్మియా 20:6 పషూరూ, నీవును నీ యింట నివసించువారందరును చెరలోనికి పోవుదురు, నీవును నీవు ప్రవచనములచేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయెదరు అక్కడనే పాతిపెట్టబడెదరు.

యిర్మియా 23:32 మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భతచేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరోధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 29:23 చెరపట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబువలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 37:3 రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహు కలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.

యెహెజ్కేలు 13:9 వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాకపోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగిరారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.

ఆమోసు 7:17 యెహోవా సెలవిచ్చునదేమనగా నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కూమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.

మీకా 2:11 వ్యర్థమైన మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినయెడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును.

మీకా 3:5 ఆహారము నమలుచు, సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టనియెడల అతనిమీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలనుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా

జెకర్యా 10:2 గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి.

మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.

2తిమోతి 3:9 అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిది కూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.