Logo

యిర్మియా అధ్యాయము 52 వచనము 5

యిర్మియా 39:1 యూదా రాజైన సిద్కియా యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చి దాని ముట్టడివేయగా

2రాజులు 25:1 అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడిదిబ్బలు కట్టిరి.

2రాజులు 25:2 ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడియుండగా

2రాజులు 25:3 నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను.

2రాజులు 25:4 కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.

2రాజులు 25:5 అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లిపోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.

2రాజులు 25:6 వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.

2రాజులు 25:7 సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.

2రాజులు 25:8 మరియు బబులోనురాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ నెల యేడవ దినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి

2రాజులు 25:9 యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.

2రాజులు 25:10 మరియు రాజదేహసంరక్షకుల అధిపతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి.

2రాజులు 25:11 పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోనురాజు పక్షము చేరినవారిని, సామాన్య జనులలో శేషించినవారిని రాజదేహసంరక్షకుల అధిపతియైన నెబూజరదాను చెరగొనిపోయెను గాని

2రాజులు 25:12 వ్యవసాయదారులును ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చెను.

2రాజులు 25:13 మరియు యెహోవా మందిరమందున్న యిత్తిడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.

2రాజులు 25:14 సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొనిపోయిరి.

2రాజులు 25:15 అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.

2రాజులు 25:16 మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను.

2రాజులు 25:17 ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీట చుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను.

2రాజులు 25:18 రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను.

2రాజులు 25:19 మరియు ఆయుధస్థులమీద నియమింపబడియున్న అధిపతిని, పట్టణములోనుండి తీసికొని, రాజు సముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరకిన అయిదుగురిని, దేశపుజనులను సంఖ్య చేయువారి అధిపతియొక్క లేఖికుని, సామాన్యజనులలో పట్టణమందు దొరకిన అరువదిమందిని పట్టుకొనెను.

2రాజులు 25:20 రాజదేహసంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసికొని రిబ్లా పట్టణమందున్న బబులోనురాజునొద్దకు రాగా

2రాజులు 25:21 బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదా వారు తమ దేశములోనుండి ఎత్తికొనిపోబడిరి.

2రాజులు 25:22 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారిమీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను.

2రాజులు 25:23 యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులందరును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పా పట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికిపుట్టిన యజన్యాను కూడి రాగా

2రాజులు 25:24 గెదల్యా వారితోను వారి జనులతోను ప్రమాణముచేసి కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవచేసినయెడల మీకు మేలు కలుగునని చెప్పెను.

2రాజులు 25:25 అయితే ఏడవ మాసమందు రాజ వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యామీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతనియొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.

2రాజులు 25:26 అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరును, సైన్యాధిపతులును, లేచి కల్దీయుల భయముచేత ఐగుప్తు దేశమునకు పారిపోయిరి.

2రాజులు 25:27 యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పదియేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువది యేడవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములోనుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి

యెహెజ్కేలు 24:1 తొమ్మిదియవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యెహెజ్కేలు 24:2 నరపుత్రుడా, ఈదినము పేరు వ్రాసియుంచుము, నేటిదినము పేరు వ్రాసియుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేముమీదికి వచ్చుచున్నాడు.

జెకర్యా 8:19 సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.

యిర్మియా 52:7 పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరు పారిపోయి రాజుతోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములోనుండి బయలువెళ్లిరి; కల్దీయులు పట్టణమును చుట్టుకొనియుండగా సైనికులు యొర్దానునది మార్గముగా తర్లిపోయిరి.

యిర్మియా 6:3 గొఱ్ఱల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తనకిష్టమైనచోట మందను మేపును.

యిర్మియా 6:4 ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.

యిర్మియా 6:5 లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము.

యిర్మియా 6:6 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసివచ్చెను.

యిర్మియా 32:24 ముట్టడిదిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయులచేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా?

లేవీయకాండము 26:25 మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింపబడెదరు.

ద్వితియోపదేశాకాండము 28:52 మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడివేయుదురు.

ద్వితియోపదేశాకాండము 28:53 అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు.

ద్వితియోపదేశాకాండము 28:54 మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్యయెడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లలయెడలను చెడ్డదైనందున

ద్వితియోపదేశాకాండము 28:55 అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలినదేమియు ఉండదు.

ద్వితియోపదేశాకాండము 28:56 నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును

ద్వితియోపదేశాకాండము 28:57 అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటియెడలనైనను తన కుమారునియెడలనైనను తన కుమార్తెయెడలనైనను కటాక్షము చూపకపోవును.

యెషయా 29:3 నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడిదిబ్బ వేయుదును.

యెషయా 42:24 యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితివిు వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా?

యెషయా 42:25 కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధబలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.

యెహెజ్కేలు 4:1 నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయుము.

యెహెజ్కేలు 4:2 మరియు అది ముట్టడి వేయబడినట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.

యెహెజ్కేలు 4:3 మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుపగోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖదృష్టిని పట్టణముమీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడివేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.

యెహెజ్కేలు 4:4 మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు.

యెహెజ్కేలు 4:5 ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను.

యెహెజ్కేలు 4:6 ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సరమొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను.

యెహెజ్కేలు 4:7 ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను.

యెహెజ్కేలు 21:22 యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టుమనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను.

లూకా 19:43 (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టుకట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి

లూకా 21:20 యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.

2రాజులు 17:5 అష్షూరు రాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను.

యెషయా 42:22 అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారు వారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు.

యిర్మియా 32:1 యూదా రాజైన సిద్కియా యేలుబడి పదియవ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

యిర్మియా 34:1 బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారముక్రిందనున్న భూరాజ్యములన్నియు జనములన్నియు కూడి యెరూషలేముమీదను దాని పురములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు.

యిర్మియా 42:18 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కోప మును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.

యెహెజ్కేలు 4:2 మరియు అది ముట్టడి వేయబడినట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.

యెహెజ్కేలు 17:17 యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.

యెహెజ్కేలు 26:8 బయటిపొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలునెత్తును.

యెహెజ్కేలు 33:21 మనము చెరలోనికి వచ్చిన పండ్రెండవ సంవత్సరము పదియవ నెల అయిదవ దినమున ఒకడు యెరూషలేములోనుండి తప్పించుకొని నాయొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడెనని తెలియజేసెను.

దానియేలు 11:15 అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడిదిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేక పోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.

మీకా 4:11 మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడి వచ్చియున్నారు.

హబక్కూకు 1:10 రాజులను అపహాస్యముచేతురు, అధిపతులను హేళనచేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటిదిబ్బ వేసి వాటిని పట్టుకొందురు.