Logo

యిర్మియా అధ్యాయము 52 వచనము 17

యిర్మియా 39:9 అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.

యిర్మియా 39:10 అయితే రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను.

యిర్మియా 40:5 ఇంకను అతడు తిరిగివెళ్లక తడవుచేయగా రాజదేహసంరక్షకుల కధిపతి అతనితో ఈలాగు చెప్పెను బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణములమీద నియమించియున్నాడు, అతనియొద్దకు వెళ్లుము; అతనియొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా

యిర్మియా 40:6 యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితో కూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను.

యిర్మియా 40:7 అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.

2రాజులు 25:12 వ్యవసాయదారులును ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చెను.

యెహెజ్కేలు 33:24 నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆ యా చోట్లను కాపురమున్నవారు అబ్రాహాము ఒంటరియై యీ దేశమును స్వాస్థ్యముగా పొందెను గదా; అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు.

2రాజులు 24:14 అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొనిపోయెను.

యెహెజ్కేలు 5:3 అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;