Logo

నిర్గమకాండము అధ్యాయము 7 వచనము 15

నిర్గమకాండము 2:5 ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి

నిర్గమకాండము 8:20 కాబట్టి యెహోవా మోషేతొ నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.

యెహెజ్కేలు 29:3 ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;

నిర్గమకాండము 7:10 కాబట్టి మోషే అహరోనులు ఫరోయొద్దకు వెళ్లి యెహోవా తమకాజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్పమాయెను.

నిర్గమకాండము 4:2 యెహోవా నీచేతిలోనిది ఏమిటి అని అతనినడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.

నిర్గమకాండము 4:3 అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.

నిర్గమకాండము 4:4 అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.

నిర్గమకాండము 9:13 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.

1దినవృత్తాంతములు 16:21 నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి

యెషయా 7:3 అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము