Logo

నిర్గమకాండము అధ్యాయము 7 వచనము 21

నిర్గమకాండము 7:18 ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను.

ప్రకటన 8:9 సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశనమాయెను.

నిర్గమకాండము 8:14 జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.

కీర్తనలు 105:29 ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.

యెషయా 19:8 జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు

యెషయా 50:2 నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా? విడిపించుటకు నాకు శక్తిలేదా? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.

ప్రకటన 8:10 మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటిబుగ్గల మీదను పడెను.