Logo

నిర్గమకాండము అధ్యాయము 26 వచనము 15

నిర్గమకాండము 26:18 ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:22 పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:23 మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:24 అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితోఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.

నిర్గమకాండము 26:25 పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను.

నిర్గమకాండము 26:26 తుమ్మకఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును

నిర్గమకాండము 26:27 మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును ఉండవలెను;

నిర్గమకాండము 26:28 ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.

నిర్గమకాండము 26:29 ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకఱ్ఱలకును బంగారు రేకును పొదిగింపవలెను.

నిర్గమకాండము 36:20 మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.

నిర్గమకాండము 36:21 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.

నిర్గమకాండము 36:22 ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను. అట్లు మందిరముయొక్క పలకలన్నిటికి చేసెను.

నిర్గమకాండము 36:23 కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.

నిర్గమకాండము 36:24 ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.

నిర్గమకాండము 36:25 మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తరదిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను,

నిర్గమకాండము 36:26 అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను.

నిర్గమకాండము 36:27 పడమటిదిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.

నిర్గమకాండము 36:28 వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.

నిర్గమకాండము 36:29 అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒకదానితోఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను.

నిర్గమకాండము 36:30 ఎనిమిది పలకలుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను.

నిర్గమకాండము 36:31 మరియు అతడు తుమ్మకఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డకఱ్ఱలను

నిర్గమకాండము 36:32 మందిరముయొక్క రెండవప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను.

నిర్గమకాండము 36:33 పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండచేసెను.

నిర్గమకాండము 40:17 రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.

నిర్గమకాండము 40:18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి

సంఖ్యాకాండము 4:31 ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను

సంఖ్యాకాండము 4:32 దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.

ఎఫెసీయులకు 2:20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

ఎఫెసీయులకు 2:21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది.

నిర్గమకాండము 25:5 ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,

సంఖ్యాకాండము 3:36 మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని