Logo

లేవీయకాండము అధ్యాయము 14 వచనము 35

ద్వితియోపదేశాకాండము 7:26 దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను.

యెహోషువ 7:21 దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.

1సమూయేలు 3:12 ఆ దినమున ఏలీయొక్క యింటివారిని గురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును.

1సమూయేలు 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.

1సమూయేలు 3:14 కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని.

1రాజులు 13:34 యరొబాము సంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.

కీర్తనలు 91:10 నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు

సామెతలు 3:33 భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.

జెకర్యా 5:4 ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.

లేవీయకాండము 13:2 ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడినయెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొనిరావలెను.