Logo

లేవీయకాండము అధ్యాయము 17 వచనము 16

లేవీయకాండము 5:1 ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచినదానిగూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియైయుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును.

లేవీయకాండము 7:18 ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.

లేవీయకాండము 19:8 దానిని తినువాడు తన దోషశిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 20:17 ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచినయెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును.

లేవీయకాండము 20:19 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్తసంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.

లేవీయకాండము 20:20 పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.

సంఖ్యాకాండము 19:19 మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమున పవిత్రుడగును.

సంఖ్యాకాండము 19:20 అపవిత్రుడు పాపశుద్ధి చేసికొననియెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహారజలము వానిమీద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు.

యెషయా 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.

యోహాను 13:8 పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.

హెబ్రీయులకు 9:28 ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్షమగును.

1పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

ఆదికాండము 35:2 యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరితోను మీయొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

నిర్గమకాండము 22:31 మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను.

లేవీయకాండము 11:24 వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 11:40 దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 15:27 వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

యోహాను 13:10 యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.

హెబ్రీయులకు 9:10 ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.