Logo

లేవీయకాండము అధ్యాయము 21 వచనము 14

సంఖ్యాకాండము 12:1 మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొనియుండెను గనుక అతడు పెండ్లి చేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.

ద్వితియోపదేశాకాండము 24:2 ఆమె అతని యింటనుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును.

యెహెజ్కేలు 44:22 వారు విధవరాండ్రనైనను విడువబడినదానినైనను పెండ్లిచేసికొనకూడదుగాని ఇశ్రాయేలీయుల సంతతివారగు కన్యలనైనను, యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్నవారినైనను చేసికొనవచ్చును.

తీతుకు 1:6 ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.