Logo

లేవీయకాండము అధ్యాయము 23 వచనము 6

నిర్గమకాండము 12:15 ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ యిండ్లలోనుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.

నిర్గమకాండము 12:16 ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.

నిర్గమకాండము 13:6 ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను.

నిర్గమకాండము 13:7 పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు.

నిర్గమకాండము 34:18 మీరు పొంగనివాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.

సంఖ్యాకాండము 28:17 ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను.

సంఖ్యాకాండము 28:18 మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు

ద్వితియోపదేశాకాండము 16:8 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

అపోస్తలులకార్యములు 12:3 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.

అపోస్తలులకార్యములు 12:4 అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను

నిర్గమకాండము 12:18 మొదటి నెల పదునాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను.

నిర్గమకాండము 13:10 కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను.

ద్వితియోపదేశాకాండము 16:3 పస్కాపండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.

యెహోషువ 5:11 పస్కా పోయిన మరు నాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్య ములను తినిరి.

న్యాయాధిపతులు 21:19 కాగా వారు బెన్యామీనీయు లతో ఇట్లనిరిఇదిగో బేతేలుకు ఉత్తరదిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి

2దినవృత్తాంతములు 30:21 యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.

మత్తయి 26:17 పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి.

మార్కు 14:12 పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయన నడుగగా,

లూకా 22:1 పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను.

1కొరిందీయులకు 5:8 గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.