Logo

సంఖ్యాకాండము అధ్యాయము 2 వచనము 9

సంఖ్యాకాండము 10:14 యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.

సంఖ్యాకాండము 2:16 రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను.

సంఖ్యాకాండము 2:24 ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనిమిదివేల నూరుమంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను.

సంఖ్యాకాండము 2:31 దాను పాళెములో లెక్కింపబడిన వారందరు లక్ష యేబది యేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.

సంఖ్యాకాండము 2:32 వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.

సంఖ్యాకాండము 3:34 వారిలో లెక్కింపబడిన వారెందరనగా, ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందలమంది.

సంఖ్యాకాండము 23:10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటిదగును గాక అనెను.