Logo

సంఖ్యాకాండము అధ్యాయము 2 వచనము 10

ఆదికాండము 49:3 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.

ఆదికాండము 49:4 నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.

1దినవృత్తాంతములు 5:1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మస్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు.

సంఖ్యాకాండము 1:5 మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;

సంఖ్యాకాండము 7:30 నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను

సంఖ్యాకాండము 7:35 ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము.

సంఖ్యాకాండము 10:18 రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.

ఆదికాండము 46:8 యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;

సంఖ్యాకాండము 1:20 ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 1:21 షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు

సంఖ్యాకాండము 2:2 ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దానిచుట్టు దిగవలెను.

సంఖ్యాకాండము 3:29 కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.

సంఖ్యాకాండము 10:6 మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.

సంఖ్యాకాండము 32:1 రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని

యెహెజ్కేలు 1:10 ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.