Logo

సంఖ్యాకాండము అధ్యాయము 6 వచనము 12

లేవీయకాండము 5:6 తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.

లేవీయకాండము 14:24 యాజకుడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.

యెహెజ్కేలు 18:24 అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణమునొందును.

మత్తయి 3:15 యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.

మత్తయి 24:13 అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.

యోహాను 8:29 నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.

యోహాను 8:30 ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి.

యోహాను 8:31 కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు;

యాకోబు 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును;

2యోహాను 1:8 అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

లేవీయకాండము 7:1 అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దానిగూర్చిన విధి యేదనగా

లేవీయకాండము 7:2 దహనబలి పశువులను వధించుచోట అపరాధపరిహారార్థబలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

సంఖ్యాకాండము 6:4 అతడు ప్రత్యేకముగానుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.

సంఖ్యాకాండము 19:9 మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్రస్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను; అది పాపపరిహారార్థబలి.