Logo

సంఖ్యాకాండము అధ్యాయము 6 వచనము 19

లేవీయకాండము 8:31 అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారులును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను.

1సమూయేలు 2:15 ఇదియు గాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితోయాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను.

నిర్గమకాండము 29:23 ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని

నిర్గమకాండము 29:24 అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.

నిర్గమకాండము 29:25 తరువాత నీవు వారి చేతులలోనుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము.

నిర్గమకాండము 29:26 మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను; అది నీ వంతగును.

నిర్గమకాండము 29:27 ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను.

నిర్గమకాండము 29:28 అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడచొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహరోనుకును అతని కుమారులకునగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన ప్రతిష్టార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును

లేవీయకాండము 7:30 అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.

లేవీయకాండము 8:27 అహరోను చేతులమీదను అతని కుమారుల చేతులమీదను వాటన్నిటిని ఉంచి, అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను.

సంఖ్యాకాండము 6:4 అతడు ప్రత్యేకముగానుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.

2దినవృత్తాంతములు 35:13 వారు ఎడ్లనుకూడ ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధిప్రకారము పస్కాపశు మాంసమును నిప్పుమీద కాల్చిరిగాని యితరమైన ప్రతిష్ఠార్పణలను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికి త్వరగా వడ్డించిరి.