Logo

సంఖ్యాకాండము అధ్యాయము 6 వచనము 25

కీర్తనలు 21:6 నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు.

కీర్తనలు 31:16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము.

కీర్తనలు 67:1 భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును

కీర్తనలు 80:1 ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.

కీర్తనలు 80:2 ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము.

కీర్తనలు 80:3 దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.

కీర్తనలు 80:7 సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము రప్పించుము. మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.

కీర్తనలు 80:19 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలోనుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.

కీర్తనలు 119:135 నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము.

దానియేలు 9:17 ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధస్థలము మీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము.

ఆదికాండము 43:29 అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక

నిర్గమకాండము 33:19 ఆయన నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.

మలాకీ 1:9 దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీచేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను.

యోబు 33:26 వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.

కీర్తనలు 80:3 దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.