Logo

సంఖ్యాకాండము అధ్యాయము 33 వచనము 14

నిర్గమకాండము 17:1 తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున

నిర్గమకాండము 17:2 మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.

నిర్గమకాండము 17:3 అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొనివచ్చితిరనిరి.

నిర్గమకాండము 17:4 అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను.

నిర్గమకాండము 17:5 అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేతపట్టుకొని పొమ్ము

నిర్గమకాండము 17:6 ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.

నిర్గమకాండము 17:7 అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.

నిర్గమకాండము 17:8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా

నిర్గమకాండము 19:2 వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.

2రాజులు 3:9 ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.