Logo

సంఖ్యాకాండము అధ్యాయము 33 వచనము 36

సంఖ్యాకాండము 13:21 కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.

సంఖ్యాకాండము 20:1 మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.

సంఖ్యాకాండము 27:14 ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నులయెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.

ద్వితియోపదేశాకాండము 32:51 ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి.

సంఖ్యాకాండము 13:26 అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజము నొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.

సంఖ్యాకాండము 20:22 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరుకొండకు వచ్చెను.

సంఖ్యాకాండము 34:4 మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.

యెహోషువ 15:1 యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరి హద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.

1రాజులు 22:48 యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలైపోయెను.