Logo

సంఖ్యాకాండము అధ్యాయము 33 వచనము 37

సంఖ్యాకాండము 20:22 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరుకొండకు వచ్చెను.

సంఖ్యాకాండము 20:23 యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరుకొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 21:4 వారు ఎదోముదేశమును చుట్టిపోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.

సంఖ్యాకాండము 34:4 మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.

సంఖ్యాకాండము 34:7 మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రముయొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.

యెహోషువ 15:1 యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరి హద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.

యెహోషువ 15:23 మోనా అదాదా కెదెషు

న్యాయాధిపతులు 11:18 తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా.