Logo

1సమూయేలు అధ్యాయము 10 వచనము 1

1సమూయేలు 2:10 యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించినవానికి అధికబలము కలుగజేయును.

1సమూయేలు 9:16 ఎట్లనగానా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.

1సమూయేలు 16:13 సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.

1సమూయేలు 24:6 ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.

1సమూయేలు 26:11 యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి

2రాజులు 9:3 తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారిపొమ్ము.

2రాజులు 9:4 యౌవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చునప్పటికి సైన్యాధిపతులు కూర్చుని యుండిరి.

2రాజులు 9:5 అప్పుడతడు అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూ యిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు అధిపతీ నిన్నుగూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశించెను.

2రాజులు 9:6 అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.

అపోస్తలులకార్యములు 13:21 ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను.

ప్రకటన 5:8 ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

2సమూయేలు 19:39 జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను.

1రాజులు 19:18 అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దుపెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.

కీర్తనలు 2:12 ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

హోషేయ 13:2 ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోత పోయుదురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు.

1దెస్సలోనీకయులకు 5:26 పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.

1సమూయేలు 8:9 అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.

1సమూయేలు 8:19 అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక ఆలాగున కాదు,

1సమూయేలు 13:14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును.

యెహోషువ 5:14 అతడుకాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసినా యేలినవాడు తన దాసునికి సెల విచ్చునదేమని అడిగెను.

యెహోషువ 5:15 అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను.

2సమూయేలు 5:2 పూర్వకాలమున సౌలు మామీద రాజైయుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి.

2రాజులు 20:5 నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియాయొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.

హెబ్రీయులకు 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

నిర్గమకాండము 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.

నిర్గమకాండము 19:6 సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా

ద్వితియోపదేశాకాండము 32:9 యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.

కీర్తనలు 78:71 పాడిగొఱ్ఱలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.

కీర్తనలు 135:4 యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను.

యిర్మియా 10:16 యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.

ఆదికాండము 20:7 కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించనియెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.

ఆదికాండము 41:40 నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.

ఆదికాండము 45:15 అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిమీద పడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.

నిర్గమకాండము 4:14 ఆయన మోషేమీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;

1సమూయేలు 12:1 అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను ఆలకించుడి; మీరు నాతో చెప్పినమాట నంగీకరించి మీమీద ఒకని రాజుగా నియమించియున్నాను.

1సమూయేలు 12:3 ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టుకొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవనియొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించినవాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.

1సమూయేలు 15:1 ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము

1సమూయేలు 15:17 అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.

1సమూయేలు 20:41 వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.

2సమూయేలు 1:21 గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యుల డాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు1సౌలు డాలును పారవేయబడెను.

2సమూయేలు 7:8 కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా గొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.

2సమూయేలు 21:6 యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించెదననెను.

1రాజులు 1:34 యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను.

2రాజులు 9:1 అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేతపట్టుకొని రామోత్గిలాదునకు పోయి

2రాజులు 11:12 అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి రాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.

2దినవృత్తాంతములు 23:11 అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొనివచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించి రాజు చిరంజీవియగునుగాక యనిరి.

జెకర్యా 4:14 అతడు వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.

మత్తయి 26:49 వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.