Logo

1సమూయేలు అధ్యాయము 10 వచనము 11

యోహాను 9:8 కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా అనిరి.

యోహాను 9:9 వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే నేనే యనెను.

అపోస్తలులకార్యములు 3:10 శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

మత్తయి 13:54 అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతనికెక్కడనుండి వచ్చినవి?

మత్తయి 13:55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా యనువారు ఇతని సోదరులు కారా?

అపోస్తలులకార్యములు 2:7 అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?

అపోస్తలులకార్యములు 2:8 మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?

అపోస్తలులకార్యములు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

అపోస్తలులకార్యములు 9:21 వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి.

1సమూయేలు 19:24 మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.

యోహాను 7:15 యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.

1రాజులు 13:11 బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని, అతడు రాజుతో పలికిన మాటలన్నిటిని తమ తండ్రితో తెలియజెప్పగా