Logo

1సమూయేలు అధ్యాయము 10 వచనము 22

1సమూయేలు 23:2 అంతట దావీదు నేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.

1సమూయేలు 23:3 దావీదుతో కూడియున్న జనులు మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా నున్నది; ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చినయెడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా

1సమూయేలు 23:4 దావీదు మరల యెహోవా యొద్ద విచారణ చేసెను నీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీచేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా

1సమూయేలు 23:11 కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.

1సమూయేలు 23:12 కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను.

సంఖ్యాకాండము 27:21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.

న్యాయాధిపతులు 1:1 యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులుకనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా

న్యాయాధిపతులు 20:18 వీరు లేచి బేతేలుకు పోయిఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 20:23 మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 20:28 అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధమునకు పోదుమా,మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీచేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.

1సమూయేలు 9:21 అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.

1సమూయేలు 15:17 అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.

లూకా 14:11 తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

ఆదికాండము 25:22 ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను

ఆదికాండము 45:20 ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా

సంఖ్యాకాండము 11:26 ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవవాని పేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి.

యిర్మియా 21:2 బబులోను రాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధము చేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లిపోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయా యొద్దకు వారిని పంపగా యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.