Logo

1సమూయేలు అధ్యాయము 10 వచనము 14

1సమూయేలు 9:3 సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్దభములను వెదకుమని చెప్పెను.

1సమూయేలు 9:4 అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు.

1సమూయేలు 9:5 అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్లుదము రమ్ము, గార్దభముల కొరకు చింతింపక, నా తండ్రి మనకొరకు విచారపడునేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా

1సమూయేలు 9:6 వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.

1సమూయేలు 9:7 అందుకు సౌలు మనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవుదుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరిపోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసికొనిపోవుటకు మనకేమియు లేదు అని తన పనివానితో చెప్పి మనయొద్ద ఏమి యున్నదని అడుగగా

1సమూయేలు 9:8 వాడు సౌలుతో చిత్తగించుము, నాయొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.

1సమూయేలు 9:9 ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన యెడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.

1సమూయేలు 9:10 సౌలు నీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా

2రాజులు 5:25 అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను.