Logo

1సమూయేలు అధ్యాయము 17 వచనము 22

ఆదికాండము 37:14 అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతినితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను

న్యాయాధిపతులు 18:15 వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ యౌవను డున్న మీకా యింటికి వచ్చి అతని కుశలప్రశ్నలడిగిరి.

మత్తయి 10:12 ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.

మత్తయి 10:13 ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగివచ్చును.

లూకా 10:5 త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్నలడుగవద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.

లూకా 10:6 సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగివచ్చును.

ఆదికాండము 29:6 మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు; ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱలవెంట వచ్చుచున్నదని చెప్పిరి.

ఆదికాండము 43:27 అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికియున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు

1సమూయేలు 16:6 వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను

1సమూయేలు 25:5 తన పని వారిలో పదిమందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి

2సమూయేలు 11:7 ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను.

2రాజులు 9:17 యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచియుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.

యిర్మియా 15:5 యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీయందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవవిడిచి నీయొద్దకు వచ్చును?