Logo

1సమూయేలు అధ్యాయము 17 వచనము 53

2రాజులు 7:7 లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందెచీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.

2రాజులు 7:8 కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి యొక గుడారము జొచ్చి భోజనపానములు చేసి, అచ్చటనుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొనిపోయి దాచిపెట్టి, తిరిగివచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చటనుండి సొమ్ము ఎత్తికొనిపోయి దాచిపెట్టిరి.

2రాజులు 7:9 వారు మనము చేయునది మంచిపని కాదు, నేటిదినము శుభ వర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చట నుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని

2రాజులు 7:10 వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతివిు. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా

2రాజులు 7:11 వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా

2రాజులు 7:12 రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక వారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.

2రాజులు 7:13 అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహుమంది మనుష్యులు లయమైపోయిరి గదా ఇక అయిదుగురు లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనయెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలొ అయిదుగురిని తీసికొనిపోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.

2రాజులు 7:14 వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగా సిరియనుల సైన్యము వెనుకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.

2రాజులు 7:15 కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొందరగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా

2రాజులు 7:16 జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.

యిర్మియా 4:20 కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచుకొనబడియున్నవి.

యిర్మియా 30:16 నిన్ను మింగువారందరు మింగివేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడుసొమ్ముగా అప్పగించెదను.

1సమూయేలు 19:5 అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా

2రాజులు 7:16 జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.